చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కిమ్ జాన్ ఉంగ్‌తో భేటీ
ప్యోంగ్యాంగ్ : రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సోమవారం ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ఏడు సంవత్సరాల తర్వాత తమ దేశంలో అడుగు పెట్టిన చైనా నేతకు ప్యోంగ్యాంగ్‌లో ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఉత్తర కొరియాతో వ్యూహాత్మక సమన్వయాన్ని, సహకారాన్ని మరింతగా పెంపొందించు కుంటామని తెలిపారు. రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు ఇవ్వాలని ఆకాంక్షించారు. జిన్‌పింగ్, కిమ్ భేటీ వివరాలను సిన్హువా వార్తా సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, ఆరోగ్య, నిర్మాణ, శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా సిద్ధంగా ఉన్నదని జిన్‌పింగ్ తెలిపారు.
జిన్‌పింగ్ దంపతులకు ఘన స్వాగతం
అంతకుముందు ప్యోంగ్యాంగ్ విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ప్రథమ మహిళ రి సాల్ జుఘన స్వాగతం పలికారు. విమానం ల్యాండ్ అయినప్పుడు ఇరువురు నేతలు చప్పట్లు కొడుతున్న దృశ్యాలు అధికారిక ఫుటేజ్‌లో కన్పించాయి. జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌లకు కిమ్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారని, ఉత్తర కొరియా చిన్నారులు వారికి పుష్పగుచ్ఛాలు అందించారని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. కిమ్ సంగ్ స్క్వేర్‌లో జరిగిన స్వాగత కార్యక్రమంలో అశ్విక దళం పాల్గొన్నది స్క్వేర్ పైన జిన్‌పింగ్, కిమ్ భారీ చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. ప్రజానీకం పూలు, పతాకాలతో స్వాగతం పలికారు. 21 తుపాకుల సెల్యూట్ అనంతరం ఇరువురు నేతలు గౌరవ వందన బృందాన్ని వీక్షించారు. ఆ బృందంలోని సభ్యులు ‘కామ్రెడ్ జిన్‌పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కిమ్, జిన్‌పింగ్ ప్రభుత్వ వేదికైన మెక్రాన్ హౌస్‌లో చర్చలు జరిపి విందులో పాల్గొన్నారు. ఈ ఏడాది జిన్‌పింగ్ జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్‌లకు వేర్వేరుగా ఆతిథ్యం ఇచ్చిన కొన్ని వారాల తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ఉత్తర కొరియాతో చైనాకు ఉన్న సన్నిహిత, చారిత్రక సంబంధాలను పునరుద్ఘాటించడానికి జిన్‌పింగ్ పర్యటన దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర కొరియాకు చైనా కీలక ఆర్థిక జీవనాధారంగా, దౌత్య భాగస్వామిగా కొనసాగుతోందని ఈ పర్యటన సంకేతాన్ని ఇస్తోంది. ప్రపంచ దేశాలలో పరిస్థితులు ఎలా మారినప్పటికీ రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ స్నేహానికి విలువనిచ్చే చైనా పార్టీ, ప్రభుత్వ వైఖరి మారబోదని కిమ్‌కు జిన్‌పింగ్ చెప్పినట్లు సిన్హువా తెలిపింది.
ఉత్తర కొరియాతో వ్యూహాత్మక సహకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



