నవతెలంగాణ – తొగుట
సోషల్ మీడియాలో అసత్యాలు, అబద్దాలతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి శనివారం ఒక ప్రకటన లో కోరా రు. నోరు తెరిస్తే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బిజెపి నాయకులు ఇలాంటి ఫేక్ దుష్ప్ర చారం చేయడం భావ్యం కాదన్నారు. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అధికార దాహంతో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి ఘనవిజయం ఖాయ మైన సందర్భంలో ఓటమిని జీర్ణించుకోలేక మరొ క్కసారి అసత్య ప్రచారాలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మార్ఫింగ్ వీడియో చేశారని ప్రతిపక్ష నాయకులపై లీగల్ గా చర్యలకు ఉపక్రమిస్తున్న బీజేపీ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి వాయిస్ ను మార్ఫింగ్ చేసి, వాట్సప్ యూనివర్సిటీ నుండి ప్రచారం చేస్తూ మరోసారి దుష్ప్రచారం కు ఒడి గడుతున్నారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్ని కల్లో ఇలాంటి దుష్ట జిమ్ముక్కులు చెసి అత్తెసరు మెజారిటీ తో గెలిచిన బీజేపీ నాయకులు ఫేక్ వీడి యోలు మరోసారి అబద్ధాలను సోషల్ మీడియా లో ప్రసారం చేసి ఓటర్లను గందరగోళ పరిస్థితి లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బిజెపి నాయకులు ఇలాంటి లత్కోర్ పనులకు పూనుకోవడం సిగ్గు చేటన్నారు. మీరేమన్న తెలంగాణ కోసం మీరు అభివృద్ధి చేస్తే చెప్పుకోవాలని సూచించారు. తెలంగాణ నుండి గెలిచిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మీరు తెలంగాణ కోసం, ఏ రోజైన ఉద్యమంలో పాల్గొన్నారా అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ కోసం ఎన్ని నిధులు తెచ్చారని, రాష్టానికి మెడికల్, నర్సింగ్ కళాశాల ఇచ్చారా ? ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారా అని నిలదీశారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు అభివృద్ధి పనులకు సహాయం చేశారా… మీరు చేసింది ఏముంది అన్నారు. దక్షిణ భారతంకు ఎప్పుడూ వివక్షే… రాష్ట్రాల ద్వారా వొచ్చే నిధులన్నీ ఎక్కువ శాతం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేటాయిస్తారు. తెలంగాణ హక్కుల కోసం, నిధుల కోసం,, వాటా కోసం ఏరోజు పార్ల మెంటు లో గళం విప్పారా అన్నారు. బీజేపీ ఎంపీ లు ఎన్నికల్లో మాత్రం అధిక ప్రేమను ఓలుక పోస్తు న్నారని నిలదీశారు. అందరికి ఆదర్శనీయుడైన శ్రీరామున్ని కూడా పార్టీకి అనుకూలంగా వాడు కోవడం వారికే చెల్లుతుందని ఎద్దేవాచేశారు. మీరు ఎన్నికుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర, మెదక్ జిల్లా ప్రజలకు తెలుసు..ఎవరు ఎలాంటి వారో అని…రాబోయే ఎన్నికల్లో మీకు వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చురకలు అంటించారు. దొంగ వాయిస్ తో అబద్దాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.