నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ నరేశ్

నవతెలంగాణ – మల్హర్ రావు
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్, ఏవో అత్తె సుధాకర్ లు హెచ్చరించారు. బుధవారం మండలంలోని కొయ్యూరు గ్రామపంచాయతీ పరిధిలో గల ఎరువులు, పురుగు మందుల, విత్తనాల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి, కొయ్యూరు ఎస్సై లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు వర్షాకాలం  ప్రారంభమవుతున్న నేపథ్యంలో  రైతులకు కావలసిన  అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందించాలని , ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి క్రయవిక్రయాలు జరపాలని దుకాణ నిర్వాహకులను ఆదేశించారు.  అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్లోకి విత్తనాలను తరలించి అధిక ధరలకు అమ్మితే దుకాణం యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని వారు తెలిపారు.  ఈ తనిఖీల్లో పోలీసు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love