
ప్రజల శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపర్తి ఎస్సై విజయ్ కుమార్ రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం మండల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించేవారిపై గట్టి నిఘా ఉంటుందని చేశారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే రౌడీషీటర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగులో ఏఎస్ఐ సదానందం, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, ఎల్లయ్య, కానిస్టేబుల్ సంపత్, కత్తుల శ్రీనివాస్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.