సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె

నవతెలంగాణ – చండూరు: తమ సమస్యలు పరిష్కరించే వరకు,సమ్మె కొనసాగిస్తామని గ్రామీణ తపాలా ఉద్యో గుల సంఘం నాయకులు క్రాంతి అన్నారు. ఏఐజీడీఎస్ఈయూ, ఎన్యూజీడీఎస్ కేంద్ర సంఘాల పిలుపు మేరకు మంగళవారం చండూరు తపాలా కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కామలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫారసులన్నీటిని 2016 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు . గ్రామీణ తపాలా ఉద్యోగులకు 8 గంటల పని, 5 లక్షల కవరేజ్ గ్రూప్ ఇన్సూరెన్స్, ఐదు లక్షల గ్రాట్యుటీ పెంచాలని కోరారు. బిజినెస్ టార్గెట్ల పేరుతో జిడిఎస్ లపై వేధించే పద్ధతులను నిలిపివేయాలని అన్నారు. తమకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, ఈశ్వరయ్య, హాతిరాం కావ్య, సునీత, సంతోష, క్రాంతి, సైదాబీ, హాతిరాం తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love