
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ బుధవారం ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలం నుంచి బండి కీర్తి, అజ్మీరా తరుణ్,చింతల తేజోరాం తదితర విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారు.మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బండి కీర్తి ఇంటర్ పస్ట్ ఇయర్ బైపీసీలో 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అడ్వాలపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా తరుణ్ ఎంపిసి ఫస్ట్ ఇయర్ లో 466 మార్కులు సాధించి స్టేట్ 2వ ర్యాంక్, తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల తేజోరాం ఎంపిసి ఫస్ట్ ఇయర్ లో 465 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంకులు సాధించారు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంపై విద్యార్థులను పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు అభినందించారు.