నల్లవెల్లి కి త్వరలో సబ్ స్టేషన్ మంజూరు…

– ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం త్వరలో మంజూరు చేసే విధంగా చూడాలని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్ దృష్టికి తీసుకెళ్లారు.వేంటనే స్పందించిన ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేసే విధంగా చూడాలని ఆదేశించారు.త్వరలోనే మంజూరు అవుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సాంబార్ మోహన్ తెలిపారు.
సోసైటిలో జీలుగ విత్తనాలు అందుబాటులో..
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీ లో రైతులఅవసరాల మేరకు జీలుగ విత్తనాలను ఉంచడం జరిగిందని, రైతులు జీలుగ విత్తనాలు కోనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు.నేల పాఠం – భూసారాన్ని పెంచేందుకు, రైతుకు దిగుబడి పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వరి పంటలోపచ్చిరొట్ట ఎరువు అయిన జీలుగ విత్తనాలు సబ్సిడీ పై అందజేస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.30 కిలోల ల జీలుగ బస్తా రైతుకు సబ్సిడీ పోను అందిస్తున్న ధర 842, 70.ఉందన్నారు. 40 కిలోల జనుము బస్తా 3500=00 సబ్సిడీ (రాయితీ) 2275-20 రైతు చెల్లించే ధర 1224 – 80 ఉందన్నారు.ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love