కాంట్రాక్ట్‌ సహాయ శిక్షణ అధికారులను ఆదుకోండి

Support contract assistance training officers– వెంటనే క్రమబద్ధీకరించండి :ఉద్యోగుల డిమాండ్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
గవర్నమెంట్‌ ఇండిస్టియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ తెలంగాణ కాంట్రాక్ట్‌ సహాయ శిక్షణ అధికారులను వెంటనే క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు మహమ్మద్‌ నసీరుద్దీన్‌, నూక తోటి పెదకొండయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో నసీరుద్దీన్‌ మాట్లాడుతూ.. మల్లెపల్లి ఐటిఐ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని, మార్గదర్శకాలను పాటించకుండా తమను కనీసం అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు కూడా చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 2015-16లో తాము కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహించినా ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదన్నారు. తమకు వెంటనే వేతనాలివ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా ఐటిఐ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఉల్లంఘించారని, రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇచ్చి.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగి నూకతోటి పెదకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love