లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాదు నగరంలోని గాజుల్ పేట్ లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అద్యక్షులు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ.. స్వామి వివేకానందుడు యువతకు స్పూర్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్,ఇందూర్ క్లబ్ కోశాధికారి పి.రాఘవేందర్, పూర్వాద్యక్షులు ఇరుమల శివలింగం, ప్రోగ్రాం చైర్మెన్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.