పల్లెవెలుగు బస్సుల్లో వయోవృద్ధులు, మహిళలకు టీ-9 టికెట్‌

నవతెలంగాణ-హైదరాబాద్
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. మహిళలు, వయోవృద్ధులకు బస్సు ప్రయాణాల్లో ఆర్థికభారం తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో అమలు చేస్తున్న టీ 624, టీ-6, ఎఫ్‌-24 టికెట్ల తరహాలో తొలిసారిగా జిల్లాల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నేటి నుంచి ఈ టికెట్‌ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Spread the love