Wednesday, April 29, 2026
E-PAPER
Homeసినిమానాగార్జున 100వ సినిమాలో టబు

నాగార్జున 100వ సినిమాలో టబు

- Advertisement -

అక్కినేని నాగార్జున దిగ్విజయంగా 99 సినిమాలను పూర్తి చేసుకుని, 100వ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు.ఆయన నటించబోయే ఈ మైల్‌ స్టోన్‌ ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపు దిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్‌ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీ కరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఇప్పటికే చిత్రకీరణలో పాల్గొంటున్నారు. నాగార్జున, టబుది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. వీరి కాంబినేషన్‌లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ‘శిశింద్రీ’లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -