కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – బెజ్జంకి
గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవలని ఎంపీడీఓ లక్షప్ప తెలిపారు. గురువారం మండల పరిధిలోని చీలాపూర్, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, లక్ష్మీపూర్, గుగ్గిళ్ల గ్రామాల్లో  ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీడీఓ  ప్రారంభించార. కార్యక్రమంలో ఏపీఓ నర్సయ్య,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శి లు ఐకేపీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన..
లోకసభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటష్టంగా అమలు చేస్తోంది.అయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ నాయకుడు కనగండ్ల తిరుపతి ఆరోపించారు. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై అధికారులు తగు చర్యలు చేపట్టాలని తిరుపతి విజ్ఞప్తి చేశారు.
Spread the love