సహకారం అందిస్తే సత్తా చాటుతాము

నవతెలంగాణ – సిద్దిపేట
సైక్లింగ్ 20వ జాతీయ (సీనియర్, జూనియర్ & సబ్ జూనియర్) మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ హర్యానాలోని పంచకులలో ఈ నెల 28 నుండి 31  వరకు జరగనున్నా. కాగా తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని జట్టులో  సిద్దిపేట పట్టణంలోని ఖేలో ఇండియా సెంటర్ నుండి  రవళి, హర్షిత , రిజ్వానా బేగం, అంకితలు ఉన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా ఆర్థిక ఇబ్బందులు సైక్లింగ్ క్రీడాకారులను వేధిస్తున్నాయి.  గతంలో రవళి ఎస్ జి ఎఫ్ అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయిలో  ఎం టి బి,మాస్ స్టార్ట్ 2 గోల్డ్ మెడల్ సాధించింది. హర్షిత ఎస్ జి ఎఫ్ అండర్ 19 రాష్ట్రస్థాయిలో  కాంస్య పతాకం, అండర్ 16 విభాగంలో టైమ్ ట్రయల్ వెండి, మాస్ స్టార్ట్ కాంస్యం, రిజ్వాన్ బేగం అండర్ 14 ఎస్ జి ఎఫ్  రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని సాధించి జాతి స్థాయిలో ఆడింది. మాస్ స్టార్ట్ , టైమ్ ట్రావెల్ బంగారు పథకం అందుకుంది. అంకిత అండర్ 16 విభాగంలో మాస్ స్టార్ట్ సిల్వర్ మెడల్ అందుకున్నారు. వీరందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. హర్షిత, రవళి ఎస్టి గర్ల్స్ హాస్టల్లో ఉంటూ ఖేలో ఇండియా సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. రిజ్వానా బేగం, అంకితల తల్లిదండ్రులు రోజువారి కూలీలు. మీరు ఇప్పటికీ కర్ణాటక, జార్ఖండ్ లో జరిగిన  జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, మంచి ప్రతిభ చూపించారు. ఆర్థిక ఇబ్బందులతో పంచకుల లో జరుగు జాతీయ స్థాయి పోటీలకు పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఎవరైనా తమకు సహకరించాలని కోరుతున్నారు. వివరాలకు కోచ్ సంజీవ్ 9640760193ను సంప్రదించగలరు.

Spread the love