కార్మిక శాఖ మంత్రి వెంటనే నియమించాలి 

నవతెలంగాణ – వీర్నపల్లి

కార్మిక శాఖ మంత్రి వెంటనే నియమించాలని ‘సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండలం కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మల్లారపు దేవయ్య అధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి,ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా కాలయాపన చేసి కార్మికులకు మొండి చెయ్యి చూపించింది. గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం చూపని ప్రభుత్వాన్ని ఎండగట్టం కార్మిక సమస్యల పరిష్కారం చూపకపోతే గత ప్రభుత్వన్ని ఎండగట్టినట్లు ఎండ గడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెల్పోర్ బొడ్డు ఏర్పాటు చేసిన వెల్పొర్ బోర్డులో పొందు పరిచిన సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయడములేదన్నారు. వెంటనే కార్మికుల పిల్లల పెళ్లిలకు సంబంధించిన బెనిఫిట్ ను లక్ష యాభై కీ పెంచాలి, నార్మల్ డెత్ కూ మూడు లక్షలు ఇవ్వాలి, ఆక్సిడెంట్ కు పది లక్షలు ,55 సం లు నిండిన కార్మికుడికి 5 వేలు పెన్సన్ సౌకర్యం కల్పించాలి, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు, కార్మికులకు పనిముట్లు కొనుకోవడని 5 లక్ష లు రూపాయలు వడ్డీ లేకుండ ఇవ్వాలి, కార్మికుల అందరికి బైక్ లు ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డులో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలన్నిటిని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2 న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల విసృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది .ఈ సమావేశానికి కార్మికులు ప్రతి ఒక్కరు హాజరై విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుంటుకు నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి కటుకురి రాజు, మాజి అధ్యక్షులు భూసా రాజం, కార్మికులు చంద్రయ్య, శంకర్, అంజయ్య, రాజం, కృష్ణ, శోభన్, వీరయ్య కార్మికులు ఉన్నారు.
Spread the love