
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు రుణ కాటన్, సాహితీలు జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్షలలో ప్రతిభ కనపరచి మొదటి ,రెండవ స్థానంలో నిలిచినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన గైడ్ టీచర్ రమ్య ను అభినందించారు. ఈనెల 18వ తేదీ హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి ప్రతిభ పరీక్షలలో కూడా అత్యద్భుత ప్రతిభ కనపరిచి మొదటి స్థానం నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.