బీజింగ్ : అమెరికా-ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడికి వీలుగా కిమ్ ప్రభుత్వం క్షిపణి ఇంజిన్లు, అణు ఆయు ధాలను పరీక్షించడంతో అవి మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ మధ్య వర్తిత్వం వహించే అవకాశం ఉందని దక్షిణకొరియా మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే వారంలో జిన్‌పింగ్ ఉత్తరకొరియా పర్య టనకు వెళ్లను న్నారని తెలుస్తోంది. అందుకోసం సన్నాహాలు జరుగు తున్నాయి. ఇప్పటికే చైనా సెక్యూ రిటీ, ప్రొటోకాల్ బృందాలు ఆ దేశంలో పర్యటించాయి. ఇరుద ేశాల సం బంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన జరగనుందనే విశ్లేషణలు వ్యక్తమవు తున్నాయి. ఉత్తరకొరియా ప్రస్తుతం అణు నిరాయుధీకరణ చర్చలకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఏదైనా దాడుల్లో కిమ్ మరణిస్తే.. తక్షణమే అణుదాడులు చేసేలా ఉ.కొరియా తన విధా నాలను సవరించినట్లు తెలుస్తోంది. అమెరికా- ఇజ్రాయెల్ తొలిరోజు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేకమంది సీనియర్ నాయ కులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉత్తర కొరియా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ పర్యటన జరుగుతోంది. ఆంక్షలతో సతమవు తోన్న కిమ్ రాజ్యానికి చైనా నుంచి ఆర్థికసహాయం అందుతోంది. తమ మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు రెండూ చర్యలు తీసుకుంటున్నాయి. ట్రంప్, కిమ్‌ల మధ్య మధ్య వర్తిత్వం వహిం చేందుకు జిన్‌పింగ్ ప్రయత్నిం చవచ్చని తెలుస్తోంది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమ యంలో ఉత్తరకొరియా విష యంలో పట్టు విడుపులతో వ్యవహ రించారు. 2019లో వియత్నాంలో ట్రంప్-కిమ్‌జోంగ్ ఉన్ భేటీ అయ్యారు . కానీ, అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉ.కొరియా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
జిన్‌పింగ్ మధ్యవర్తిత్వంతో ట్రంప్-కిమ్ మధ్య మళ్లీ చర్చలు ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



