వాషింగ్టన్ : ఇరాన్‌పై సాగించిన పోరులో అమెరికా 42 సైనిక విమానాలను కోల్పోయింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లలో కొన్ని నేల కూలగా మరికొన్నింటికి నష్టం వాటిల్లిందని అమెరికా కాంగ్రెస్ పరిశోధనా సర్వీసు ఇటీవల ప్రచురించిన అధ్యయనం తెలిపింది. మీడియా వార్తలు, అమెరికా యుద్ధ శాఖ, సైన్యం చేసిన ప్రకటనల ఆధారంగా జరిపిన అధ్యయనం వివరాలను ఈ నెల 13న ప్రచురించారు. అమెరికా నష్టపోయిన విమానాలలో నాలుగు ఎఫ్-15ఈ స్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిలో మూడు కూలిపోయాయి. కువైట్ గగనతలంలో ప్రయాణిస్తుండగా ‘స్నేహపూర్వక కాల్పుల ఘటన’లో ఇవి కూలాయని అమెరికా సైన్యం చెప్పుకుంది. నాలుగో విమానాన్ని ఏప్రిల్ ఐదవ తేదీన ఇరాన్ కూల్చివేసింది. దీనిలోని సిబ్బందిని అమెరికా దళాలు రక్షించాయి. యుద్ధంలో అమెరికా కోల్పోయిన విమానాలలో ఐదో తరానికి చెందిన ఒక ఫైటర్ జెట్ ఎఫ్‘35ఏ, భూతల దాడులు జరిపే ఒక ఏ‘10 థండర్‌బోల్ట్, ఏడు కేసీ‘135 స్ట్రాటోట్యాంకర్లు, ఒక ఈ‘3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్‌క్రాఫ్ట్, రెండు ఎంసీ‘130జే కమాండో స్పెషల్ ఆపరేషన్ విమానాలు ఉన్నాయి. ఇరవై నాలుగు ఎంక్యూ‘9 రీపర్ డ్రోన్లు, ఒక ఎంక్యూ‘4సీ ట్రిటాన్ డ్రోన్, ఒక హెచ్‌హెచ్‘60డబ్ల్యూ జాలీ గ్రీన్ హెలికాప్టర్‌ను కూడా అమెరికా కోల్పోయింది. ఇరాన్‌లో జరుపుతున్న ఆపరేషన్‌కు అయిన ఖర్చు 29 బిలియన్ డాలర్లకు పెరిగిందని యుద్ధ శాఖ అంచనా వేసింది. కాగా ఎన్ని విమానాలను కూల్చివేశారు, ప్రమాదవశాత్తూ ఎన్ని దెబ్బతిన్నాయి వంటి వివరాలేవీ అందుబాటులో లేవు. ఈ అధ్యయనం నివేదికను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు. యుద్ధంపై అనేక బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయన్న విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అంగీకరించిందని తెలిపారు.
ఇరాన్ యుద్ధంలో 42 విమానాలనుకోల్పోయిన అమెరికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



