తాండూర్‌ వార్‌ పట్నం వర్సెస్‌ పైలెట్‌

Tandoor War Patnam vs. Pilot– బీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు
– పట్టుకోసం పైలెట్‌ ప్రయత్నాలు
– పైలెట్‌కు చెక్‌ పెట్టేందుకు పట్నం వర్గీయుల వ్యూహాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో అంతర్గత వార్‌ కొనసాగుతోంది. గతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య నిత్యం ఓ యుద్ధమే జరిగేది. అయితే దీనిపై అధిష్టానం జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చింది. కానీ అంతర్గతంగా వీరి మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. పైలెట్‌కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించడంతో వారి మధ్య అంతర్గత విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. అధిష్టానం జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పట్నంను బుజ్జగించేందుకు మంత్రి పదవి కట్టబెట్టింది. దాంతో ఇరువురు నేతలు కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తున్నట్టు బహిరంగంగా కనిపిస్తున్నా వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పైలెట్‌కు టికెట్‌ కేటాయించ డాన్ని పట్నం అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. రాబోయే ఎన్నికల్లో పైలెట్‌ గెలిస్తే తమ నాయకుడు పట్నం రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవుతుందని ఆందోళన చెందుతున్నారు. దాంతో అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ పైలెట్‌ను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి బీఆర్‌ఎస్‌లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎలాంటి గ్రూపు రాజకీయాలు ఉండకుండా జాగ్రత్త పడాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం వేసిన ఎత్తుగడలు ఫలించడం లేదు. ఆధిష్టానం ఎన్నిచెప్పినా తమ రాజకీయ స్వావలంబన కోసమే లీడర్లు వెంపర్లాడుతున్నారు. తాండూరు నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి అసెంబ్లీ టికెట్‌ కేటాయించింది. దీనికి పట్నం సైతం సై అన్నప్పటికీ.. క్యాడర్‌ మాత్రం పట్నంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మున్నాళ్ల మచ్చటగా ఉన్న మంత్రి పదవి చూసుకుంటే.. రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయే ప్రమాదం ఉందని పట్నం అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు అసెంబ్లీ నుంచి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు రాజకీయ బిక్షపెట్టింది తాండూరు ప్రజలే. 1994, 2009, 2014లో తాండూరుకు ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నంపై కాంగ్రెస్‌ అభ్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. తరువాత పైలెట్‌ గులాబీ గూటికి చేరారు. దాంతో పట్నం, పైలెట్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వివాదాలు కొనసాగాయి. నిత్యం ఇరుగ్రూపుల మధ్య విభేధాలతో వార్తల్లో నిలిచేవారు. దీనికి చెక్‌ పెట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగి

Spread the love