ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

నవతెలంగాణ – ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం తన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబరు 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

Spread the love