నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు టీ పాయింట్, పాన్ షాప్ తెరిచి ఉంచినందుకు ఒక రోజు జైలు శిక్ష పడిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ గురువారం తెలిపారు. ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 5వ తేదీన బాబన్సహా పహాడ్ ఏరియా లో అబ్దుల్ హాఫి అతను అర్ధరాత్రి వరకు టీ పాయింటు,షాప్ ఓపెన్ చేసి ఉంచడంతో ఐదవ టౌన్డ్ల కేసు నమోదు చేశారు. 09తేదీ న అతనిని నిజామాబాదు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ అబ్దుల్ హఫీ కి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.