కాటాపూర్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

– ఉత్తమ గురువులకు సత్కారాలు
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గోరంట్ల రాజేష్ ఆధ్వర్యంలో  మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గోరంట్ల రాజేష్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నతమైనది, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎనలేనిది అని, నవ సమాజ నిర్మాణానికి గురువులే వారదులు. అలాంటి గురువులను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలని అన్నారు. కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల అభివృద్ధికి కృషిచేసిన ఉపాధ్యాయులకు విద్యార్థులు పూలమాలలు వేసి, శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుల సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండి జాఫర్ అలీ, జీవన్ లాల్, అక్బర్ పాషా, మదన్మోహన్, పద్మజ, సంధ్యారాణి, చంద్రమౌళి, నర్సింహులు, జైపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Spread the love