Monday, July 20, 2026
E-PAPER
Homeదర్వాజకన్నీటి సెలిమె

కన్నీటి సెలిమె

- Advertisement -

నింగిలోమెరిసే మెరుపులా వచ్చిపోయే
ఆనందంకోసం ఎంతోదుఃఖాన్ని దారపోసాను.
కలల అలలపై ఎగిసిపడుతున్న కాలాన్ని
దాటడం అంటే యుగాలనాటి కన్నీటి చరిత్రను చదవడమే.
మంచుతెరల్లా కనిపిస్తూ జీవితాన్ని సున్నాలా చుట్టేసి
ఏమీతెలియని చల్లని మంచుగడ్డలా … జీవితాన్ని
కాలం కరిగిస్తూనే ఉంటుంది.
దినమంత చెమటచుక్కల్నిపోగేసి… రుధిరాన్ని
చిందించి… ఫలితం తాలూకు చిరునామా ఎక్కడని
కాలాన్ని అడిగితే.. రేపటిరోజును అడగమంటుంది.
జీవితానికి కాలానికి మధ్య ఏదో ఆశయాల
స్వప్నాలు వ్రేలాడుతున్నాయి అందని ద్రాక్షాలా.
మళ్ళీ వస్తుందోలేదో తెలియని ఈ మనిషి రూపానికి
అందరి రుణం తీర్చుకోవాలని తొందరెక్కువగా ఉంది.
నవ్వులపూలు పూయించాలని అందరి హృదయాలను…
ప్రేమతో తాకాలని ఉంది.
కన్నీటి నీటిసెలిమె అంతా ఎండిపోయింది.
ఎంత వేదనతో గుండెను తవ్వినా..
అశ్రుదారల అడ్రస్ కంటిపై కనిపించడం లేదు.
చివరినిమిషం వరకు పోరాడటం తప్ప…
ఎం చెయ్యాలో తెలియని తనువుకి….
కలల వరదలు ప్రవాహాలై పరుగులు తీస్తున్నాయి.
కొన్ని వర్ణాల రంగులు… రంగులలోకాన్నో
కనురెప్పలకింద దాక్కొని రేపటి లక్ష్యాన్ని
ముద్దాడమని ముందుకు నెట్టుతున్నాయి.
స్వప్నాల ఆంక్షలను అందిపుచ్చుకోవాలని
నిరంతరం సైనికుడినై యుద్ధం చేస్తున్నాను
నాతోనేను.
ప్రేమగీతం ఎవ్వరు వినిపించకపోయిన
ద్వేషాల వలయంలో చుట్టుకొని సాగుతున్న
బ్రతుకు ప్రయాణానికి…
కష్టాలులేని పొద్దు పొడిచేది ఎప్పుడో..?
అశోక్ గోనె, 9441317361.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -