పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన తహసిల్దార్

నవ తెలంగాణ-రామగిరి 
రామగిరి మండలం బేగంపేట గ్రామములో మండల తహసిల్దార్ చల్ల  రామ్మోహన్ అధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ రామ్మోహన్ మాట్లాడారు.. గ్రామంలో అంటరానితనం, గుళ్లో, బల్లో, మాల, మాదిగ కుల, లింగ వివక్ష భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉంటున్నారా లేదా అని గ్రామస్తులతో తెలుసుకొని మనుషులంతా ఒక్కటే అని ప్రజలకు తెలిపారు.  ఈ కార్యక్రమములో రామగిరి సబ్ ఇన్స్పెక్టర్ కటికే రవి ప్రసాద్, గ్రామ సర్పంచ్ బుర్ర పద్మ శంకర్ గౌడ్, ఎంపీటీసీ మారగొని కరుణ కుమారస్వామి, ఆర్ఐ రాజబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
Spread the love