నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తెలిపింది. శనివారం హైదరాబాద్‌లోని టీపీటీఎఫ్ కార్యాలయంలో ఆ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ప్రదీప్, నాయకులు రవికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, కార్యదర్శి పి నాగిరెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేశ్, పాల్గొన్నారు. విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకుల తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు.