– ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ-అమీన్‌పూర్/మియాపూర్
తెలంగాణ పూల పండుగ ‘బతుకమ్మ’ దేశానికే ఆదర్శమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మున్సిపాల్టీలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో సీఐటీయూ, ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలో మల్లు లక్ష్మి పాల్గొని స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు మహిళలకు తగినంత గౌరవం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, వివిధ కాలనీల మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక నెమలినగర్, పీజేఆర్‌నగర్, గచ్చిచౌలి ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా పాల్గొన్న అరుణజ్యోతి మాట్లాడుతూ.. బతుకమ్మ గొప్పతనాన్ని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టడంలో వెనకబడ్డాయని విమర్శించారు. అందుకు ఉదాహరణే మణిపూర్ ఘటన అని తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం అవసరం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వహణ బాధ్యులు మంజుల, సుజాత, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు విజరు కుమార్, రవీందర్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.