నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

నవతెలంగాణ-హైదరాబాద్ : 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. TGPSC భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల, ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుదిరూపు తీసుకురాగా.. సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది.

Spread the love