– ఇంతకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని..?
– ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించిండు..?
– ఎన్ని అమలు చేసిండ్రు.? కె సి ఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చి.. ?
– ఒకసారి చూద్దాం..
నవతెలంగాణ -జయశంకర్ భూపాలపల్లి
బంగారు తెలంగాణ అన్నడు కానీ బ్రమల తెలంగాణ చేసిండు.!
1.దళితున్ని ముఖ్యమంత్రి చెయ్యలేదు. ఇదొక మోసం.
2.డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదు. ఇదొక మోసం.
3.రైతులకు ఒకే సారి లక్ష రూపాయల ఋణ మాఫీ చేయలేదు. ఇదొక మోసం.
4.దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలే. ఇదొక మోసం.
5.అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతుకు తొమ్మిది ఏళ్లుగా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇదొక మోసం.
6.KG to PG విద్య అందివ్వలేదు. ఇదొక మోసం.
7.మన ప్రాంతం నీళ్లను వేరే ప్రాంతాలకు దోచుకుపోతున్నారు. ఇదొక మోసం.
8.రైతులు పండించిన ధాన్యం అమ్మలంటే రైతుల ధాన్యం జోకుడు కాడా మోసమే, రైస్ మిల్లర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదొక మోసం.
9.ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలేదు. ఇదొక మోసం.
10.ఊరిలో అర్హులైన పెన్షన్ దారులకు అందరికి రావాల్సిన పెన్షన్ కొందరికే ఇస్తున్నారు. ఇదొక మోసం.
11.దళిత బంధు కాస్త టి ఆర్ ఎస్ బంధు గా మారిపోయింది. ఇదొక మోసం.
12 రాష్టంలో అవినీతి పెరిగిపోయింది. ఇదొక మోసం.
13.తెలంగాణ రాష్టం ఏర్పడే నాటికి రాష్ట మిగులు బడ్జెట్ 17వేల కోట్ల ఉండగా,గడిచిన 9 ఏళ్లలో ఆరు లక్షల కోట్ల అప్పుల రాష్టంగా చేశారు. ఇది భారీ మోసం.
14.ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగుల జీతాలకోసం ప్రతి నెల ఎదో ఒక చోట అప్పులు5 చేస్తున్న వైనం. ఈ కఠినమైన మోసం.
15.అధిక ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇది బహిరంగ మోసం.
16.ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చి ప్రజల స్థిర ఆస్తి అయిన భూమి మీద ప్రజలకు భరోసా లేకుండా చేశారు, ఇది ప్రతి ఇంటింటికి మోసం.
17.భూములు రాత్రికి రాత్రే వేరే వాళ్ళ పేరుమీద పట్టా అయిపోతుంది,ఇలాంటి సంఘటనలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కొంపలు కూల్చే మోసం.
18.తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు,ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు న్యాయం జరుగలేదు,తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనని వాల్లు,తెలంగాణ వ్యతిరేకులు ఈరోజు అధికారాలు,రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ మోసం చేసిన ఘరానా మోసం.
19. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రవాళ్లను ఉద్దేశించి (లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే) అన్న కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ పని ఆంధ్రావాళ్లకే ఇచ్చారు. ఇది పగటి దొంగల మోసం.
20.తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక ఉద్యోగాల నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది తల్లి కడుపులో పిండం ఉండగానే హత్య చేసే మోసం.
21.టీఎస్పీఎస్సి లో పేపర్ లీకేజీ లు ఎంత దారుణం. ఇది వారికి పుణ్యం విద్యార్థులకు మోసం.
22.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇది గ్యారడి చేసే మోసం.
23. తెలంగాణలో దళితుల మీద దాడులు,హత్యలు పెరిగాయి. ఇది కనుగొడ్లు పీకే మోసం.
24.పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. ఇది మాయల ఫకీర్ మోసం.
25.ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వలేదు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు కదా, ఇది ఒక క్రైమ్ మోసం.
26.కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ కాలేదు. ఇది మోసాలకే మోసం.
తెలంగాణ ప్రజలను ఇన్ని రకాలుగా మోసాలు చేసి ఇంకా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అని నీ , నీ పార్టీ ఉనికి కాపాడుకుంటూ తెలంగాణ ప్రజల మీద భారం మోపుతూ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి 20 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తూ..మా తెలంగాణను ఇంకా అప్పుల రాష్టంగా చేస్తున్నారు కాబట్టి పి సి సి పిలుపు మేరకు ముఖ్యమంత్రి కే సి ఆర్ దిష్టి బొమ్మను ధద్గం చేసి మల్హర్ మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది
– దండు రమేష్
జిల్లా చైర్మన్
కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం జయశంకర్ భూపాలపల్లి