కొలతల ప్రకారం పనులు చేసి, తగిన కూలీ పొందండి

నవతెలంగాణ-మల్హర్‌రావు
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో భాగంగా కూలీలకు ఉపాధిహామీ సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే రోజు కూలి రూ.272 పొందాలని మండల ఎంపిడిఓ నరసింహమూర్తి చెప్పారు. గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఏపీఓ గిరి హరీష్‌తో కలిసి తాడిచెర్లలో కూలీలు చేస్తున్న పని ప్రదేశాలను పర్యవేక్షణ నిర్వహించారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉపాది పనులు జోరుగా కొనసాగుతున్నాయని, మొత్తం కూలీలు 2,982 మంది పనులకు వెల్లుతున్నారని చెప్పారు. కూలీలకు రోజు ప్రభుత్వం అందించే రూ.272 కూలి రావాలంటే ప్రతి కూలి కొలతలు ప్రకారం పని చేయాలని తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాది సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love