నవతెలంగాణను ఆదరించండి.. చందాదారులుగా చేరండి… సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు

నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
నవతెలంగాణ దినపత్రికను ఆదరించి చందాదారుల చేరాలని సిపిఐ (ఎం)జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని కారల్‌ మార్క్స్‌ కాలనీలో నవతెలంగాణ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ ఎర్రం సతీష్‌ కుమార్‌ తో కలిసి నవతెలంగాణ దినపత్రిక క్యాంపెయిన్‌ నిర్వహించారు. చందాదారులకు అవగాహన కల్పిస్తూ చందాలు చేర్పించి రసీదులను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా బందు సాయిలు మాట్లాడుతూ…గత ఎనిమిది సంవత్సరాల కిందట ఆరంభమైన నవతెలంగాణ నేడు నాలుగు ఎడిషన్లతో అనేక సవాళ్లనధిగమిస్తూ సాగుతున్నదన్నారు. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నదని. గొంతులేని వాడి గొంతుక నవతెలంగాణ అని కొనియాడారు. సకల జనుల గుండెచప్పుడు నవతెలంగాణ. మన నదీజలాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, వాటి అభివద్ధి వంటి వాటిపై అటు ప్రభుత్వానికి, ఇటు ప్రభుత్వేతర సంస్థలకు -సూచనలు, సలహాలు ఇవ్వడం నవతెలంగాణ దిన చర్య అని వివరించారు. తెలంగాణ గడ్డపై జనుల జీవనానికి సంబంధించిన అన్ని అంశాలను అందిస్తోందన్నారు. ప్రజల సమస్యలకు అద్దం పట్టి అధికార యంత్రాంగం దష్టికి తీసుకెళుతోందని, పరిష్కారాలకు మార్గం పరుస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు నిత్యమూ, నిరంతరమూ చైతన్యంతో మెలగాలన్న అవసరాన్ని గుర్తు చేస్తున్నది. మన వనరుల్ని కబళించే కుట్రల్ని గమనించి ప్రజా సమూహాల్ని అప్రమత్తం చేస్తున్నదన్నారు. ప్రజల గమనం, గమ్యానికి వెలుగు దారెటో సూచిస్తున్నదన్నారు. ప్రజల సంవేదనల్నీ, ఆందోళనల్నీ, ఉద్యోగుల, కార్మికులు, కర్షకుల, మహిళల బాధల గాధలను లోకానికి ఎరుకపరుస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్య సాధన కోసం ఏంచేస్తున్నామో, ఏం చేయాలో అనే విషయా లను నిర్భయంగా నిజాలను వినిపిస్తున్నది. అణచివేతకు, వివక్షతకు గురయ్యే వర్గాలకు అండగా నిలబడుతున్నదన్నారు. మభ్యపెట్టే ప్రభుత్వ వర్గాల గారడీలను ప్రశ్నిస్తున్నదన్నారు. నదులు, జలాశయాలు, చెరువులు జలపాతాలతో అలరారే తెలంగాణ, అడవులలో జీవనం సాగించే ఆదివాసీలు, మైదాన ప్రాంత గిరిజనులు, కొండలు కోసలు, పల్లెలు, పట్టణాలు, పంటలు, పరిశ్రమలు, గనులు, శ్రమలు, బతుకు ఒడిదుడుకులు… ప్రతి సందర్భం ప్రతి సందోహం, ఆందోళన, ఉత్సవం అన్ని నవతెలంగాణ వార్తా ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయన్నారు. భిన్న మతాలు, తెగలు, సాంప్రదాయాలు, సంస్కతులు వున్నా, అందరు కలిసిమెలసి ఉండటం, కలివిడిగా బతకటం తెలంగాణ రీతి. పండగలు, పబ్బాలు, ఉత్సవాలు, సామూహిక సంబరాలు ఈ నేలలోని లౌకిక స్వభావానికి సంకేతం. ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే కధనాలు, వ్యాసాలు, వార్తలు నవతెలంగాణ ప్రత్యేకతలు అని వివరించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో, నిజాయితీ, నిర్భీతి, నిబద్ధతతో కూడిన పాత్రికేయ బందం కషితో ప్రతి ఉదయం మీ ముందుకు వస్తున్న సమగ్ర తెలుగు దిన పత్రిక అని కావున ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, నవ తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ పుల్ల సజన్‌ తదితరులు ఉన్నారు.

Spread the love