క్విజ్‌ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ప్రకాష్‌ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
జిల్లాలోని యువతీ యువకులు పోటీలలో పాల్గొని సద్వినియం చేసుకొని బహుమతులు గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ప్రకాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్‌ దేవన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ప్రకాష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు….తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి యూత్‌ డిక్లరేషన్‌ లో భాగంగా విద్యార్థులను యువతి యువకులను యొక్క మేదో సంపత్తిని గుర్తించి వప్రోత్సహించడానికి రాజీవ్‌ గాంధీ ఆన్లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క క్విజ్‌ కాంపిటీషన్‌ పాల్గొనాలంటే 7661899899 అనే నెంబర్కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే ఫోన్‌ రింగ్‌ అయి కట్‌ అవుతుంది వెంటనే మీకు టెక్స్ట్‌ మెసేజ్‌ ద్వారా ఒక లింకు వస్తుందని, ఆ లింకును ఓపెన్‌ చేసి సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచి లాస్ట్‌ లో రిఫరల్‌ ఐడి అడుగుతుందన్నారు. అందులో 0066 అనే నెంబర్ను పొందపరిచి నమోదు చేసినట్లయితే మీకు వెంటనే హాల్‌ టికెట్‌ నెంబర్‌ వస్తుందన్నారు. ఈ క్విజ్‌ కాంపిటీషన్లో మీ యొక్క పేరు నమోదు చేయబడుతుంది కాబట్టి అందరూ గమనించి ఈ యొక్క రాజీవ్‌ గాంధీ ఆన్లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్లో పాల్గొనాలంటే జూన్‌ 1 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూన్‌ 2వ తేదీన ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. మొదటి బహుమతి ల్యాప్‌ టాప్‌, రెండవ బహుమతి స్మార్ట్‌ ఫోన్‌, మూడవ బహుమతి టాబ్లెడ్‌ బహుమతులు ఇవ్వడం జరుగుతుం దన్నారు. ప్రోత్సాహ బహుమతుల కింద పది స్మార్ట్‌ వాచ్లు ,10 ఇయర్‌ పార్ట్స్‌ ,10 హార్డ్‌ డ్రైవ్లు ,10 పవర్‌ బ్యాంక్స్‌ ,మరియు ప్రతి నియోజకవర్గంలో మహిళా టాపర్గా నిలిచినటువంటి మహిళా అభ్యర్థికి ఎలక్ట్రిక్‌ బైకును అందజేయడం జరుగుతుందన్నారు. ఈ క్విజ్‌ కాంపిటీషన్లో పాల్గొనేవారి వయసు 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు అర్హులు అని తెలిపారు. సందేహాలు ఉంటే 7893308756 అనే నెంబర్‌ కు కాల్‌ చేసి సందేహాలను నివత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంపటి భువన సుందర్‌, భూపాలపల్లి రూరల్‌ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, గణపురం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్‌, రేగొండ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, మహా ముత్తారం అధ్యక్షుడు పక్కల సడవలి, ఎన్‌ ఎస్‌ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు పొనకంటి శ్రీనివాస్‌, కంచర్ల సదానందం, ఎన్‌ ఎస్‌ యు ఐ నాయకులు పాల్గొన్నారు.

Spread the love