– ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్
నవతెలంగాణ-చివ్వేంల
అమరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా చివ్వేంల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో అమరవీరుల చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల త్యాగాలకు మరువకూడదన్నారు.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి,ఎంపీటీసీ సుశీల,బిఆర్ఎస్ నాయకులు బాబు నాయక్, గోవిందరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు