తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి: షేక్ బషీరుద్దీన్

నవతెలంగాన – ఖమ్మం రూరల్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తమ్మినేని సుబ్బయ్య భవనంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు జక్కంపూడి కృష్ణ అధ్యక్షుడు జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో షేక్ బషీరుద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేసిన తప్పు మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూడా చేయకుండా యువత ఇచ్చినా మీరు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద యువతకు అనేక ఆశలు ఉన్నాయని ఆ ఆశలు అడియాశలు చేయకుండా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా గ్రూప్ 4 ఇతర గ్రూపుసు అలాగే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన సందర్భంగా తెలిపారు. దాదాపు రాష్ట్రంలో 40 లక్షల పై నిరుద్యోగులు ఉన్నారని ఉద్యోగాలన్న ఇవ్వాలని, లేదా ఉపాధి అన్న చూపించాలని, దానికోసం జిల్లాలో స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధి చూపులేని పక్షంలో కనీసం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా   పదివేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం కచ్చితంగా నిరుద్యోగ ఆశలు తీరుస్తుందని ఆయన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పొన్నం మురళి మాట్లాడుతూ.. మండలంలో డివైఎఫ్ఐని బలోపేతం చేసేందుకు  కార్యక్రమాలు రూపొందించుకుందామని మండల బాడీ సమావేశం ఈ నెలలో ఏదిలాపురంలో నిర్వహిస్తామని సభ్యత క్యాంపెయిన్ మొదలుపెట్టామని, గ్రామ కమిటీలు వేసి మండల మహాసభ నిర్వహిస్తామని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు తాటి వెంకటేశ్వర్లు, తోట నరేష్ రెడ్డి, నరేష్, ఆనీష్, ఉపేందర్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Spread the love