నిఖార్సయిన తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ

Telangana Plaintiff Konda Laxman Bapujiనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిఖార్సయిన తెలంగాణ వాది, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 లోను, 2009-2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాలలో పాల్గోన్నారు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎలగందుల మురళి అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని అమరవీరుల పార్క్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి నలుగురు యువకులకు వ్యూహం రచించి, 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్‌ బజార్‌లో నారాయణరావు పవార్‌ బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. పవార్‌ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్‌ చేశారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెతుకు శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆమంద్ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు కుర్లెం శివ తదితరులు పాల్గొన్నారు.
Spread the love