నవతెలంగాణ – చండూర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ చండూరు పట్టణ అధ్యక్షుడిగా నల్ల సత్యనారాయణ గౌడ్ నియామక పత్రాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ గాంధీభవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కి, సహకరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి, రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ కి, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు రావిరాల రాజేంద్రప్రసాద్ కి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులకు, కృతజ్ఞతలు తెలిపారు.