దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం..

– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
 61 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత  తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి  పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ, దశాబ్ది దినో త్సవం సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పులి గారి శివయ్యతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ను సాకారం చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమం లో దేశానికి ఆదర్శంగా నిలి పిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువొచ్చిన కేసీఆర్ ప్రత్యేక నిధులు  కేటాయించి వాటి బలోపేతం కోసం కృషి చేయడం గొప్ప విషయం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువు కుంటలను అభి వృద్ధి చేసిన మహ నాయకుడు అని కొనియాడా రు. సాగునీటి సౌకర్యం, మిషన్ భగీరథ, 24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో గ్రామాల్లో పచ్చని పంట పొలాలతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పాత్కుల ఎల్లయ్య, నాయకులు డబ్బికారి పెంటోజి, సిరిసిల్ల రాజేష్, ఈదుగాళ్ల పర్శరాములు, బండారు స్వామి గౌడ్, సుతారి రాములు, పాత్కుల బాలేష్, బెజ్జనమైన కనక రాజు, ఎర్రోళ్ల నాగయ్య, ఎండీ జహంగీర్, బాల య్య, పాత్కుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love