తెలంగాణ ఆకాంక్షలు ఆకాశంలోనే మిగిలాయి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ- వీపనగండ్ల
తెలంగాణ ఆకాంక్షలు ఆకాశంలోనే మీగిలాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం ఎండి, మహబూబ్‌ పాషా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాల అయినా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది సంబరాలు జరుపుకుంటున్నది. కానీ రాష్ట్రం కోసం పోరాడిన ప్రజల ఆశలు ఆకాంక్షలు మాటేమిటి అని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కోసమే కదా తెలంగాణ ప్రజలు పోరాడింది త్యాగాలు ఆశలు నిరాశలుగా మెలిగాయన్నారు. త్యాగాలు ఒకరివిగా భోగాలు మరొకరిగా పరిస్థితి మారిందన్నారు. ఖాళీలు నింపలేదు నోటిఫికేషన్‌ అవినీతి అక్రమాలకు నిలమయ్యాయన్నారు.కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ పార్ట్‌ టైం ఉద్యోగులకు రెగ్యులైజేషన్‌ చేయలేదన్నారు సంవత్సరాలుగా ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు అధికారాలు అన్ని ఒక్కరి చేతిలో కేంద్రీకృతమై ఇది ప్రజాస్వామ్యం అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎండి మహబూబ్‌ పాషా , మురళి, మండల నాయకులు సంగినేనిపల్లి సర్పంచ్‌ హార్‌ మౌలాలి, ఈశ్వర్‌ నాగరాజు ,రామచంద్రయ్య గౌడ్‌ తదితరులున్నారు.

Spread the love