తెలుగు రాష్ట్రాలు-భిన్న రాజకీయ శిబిరాలు

Telugu states-Different political campsతెలుగురాష్ట్రాల్లో ఉనికిలోనే లేని బీజేపీపై పోరా టం ఏమిటి? దాన్ని ఎందుకు విమర్శించాలంటూ మా ట్లాడటం ఎంత అనాలోచితమో ఈ వారం అందరికీ తెలి సివచ్చింది. ప్రధాని మోడీ విజన్‌ను తాను ఎప్పుడూ బలపరుస్తూనే వున్నానని సంజా యిషీ చెప్పుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో సహా వెళ్లి వెంటబడి మరీ పొత్తు ఖరారు చేసుకుంటున్నారు. సింహం సింగిల్‌గా వస్తుంది గనక నాకు పొత్తులతో పనిలేదని గొప్పగా చెప్పుకునే ఏపీ ముఖ్య మంత్రి జగన్‌ బీజేపీని మోడీని ప్రస్తావిం చకుండానే ఇద్దరు రాష్ట్ర నేతలను వారి పార్టీలపై మాత్రం రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్‌ పాలకులు ముగ్గురిలో ఒకరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత పేర్కొన్నట్టు బీజేపీపై విమర్శ ఎందుకని ప్రశ్నిం చి ఆ పైన సర్దుకునేందుకు ఉగ్రరూపంతో చెలరేగి పోతున్నారు. కనిపించని కాషాయ పార్టీ ప్రభావం ఎంతో ఎందుకో ఈ తాజాపరిణామాలే చెబుతున్నాయి. దక్షిణా దిన కర్నాటక తప్ప మరెక్కడా ఠికానా లేని బీజేపీ నోటా కన్నా తక్కువ ఓట్లుతెచ్చుకున్న ఏపీ పార్టీలు మూడింటినీ తన చుట్టూ తిప్పుకోవడం విచిత్రంగా కనిపించే వాస్తవం. ఘర్‌వాపసీ పేరుతో మళ్లీ ఎన్‌డిఎ ప్రాంగ ణంలో ప్రవేశించి బీజేపీ పంచన చేరడానికి టీడీపీ, జనసేన పాకులాడటం దివాళాకోరు రాజకీయాలకు తాజా నిదర్శనం,
జగన్‌, బాబు పవన్‌ ప్రదక్షిణలు
ముందు ఏపీ సంగతి తీసుకుంటే ఏదిఏమైనా బీజేపీతో కలసి వెళ్లాలని చంద్రబాబు ఆరాటపడటం, ఆఖరివరకూ తలుపుతీసి వుంటానని ప్రకటించడం రాజ కీయ వర్గాలలో తెలిసిన విషయమే.ఓట్ల చీలిక నివారిం చడం, అరెస్టు తర్వాత కేసుల వేట నుంచి రక్షించు కోవడం, ఎన్నిక్లల్లో ప్రచారం ఎన్నికల నిర్వహణ సజా వుగా వుండేట్టు కేంద్రం సహాయం తీసుకోవడం మూడు కారణాలుగా చెప్పుకుంటున్నవే. ఇలా మూడు కారణాలు చెబుతుండగా నాల్గవది ఆయన ‘ఫోర్త్‌ విజన’్‌ అంటు న్నారు. ఎన్నికల అనంతర పరిణామాలు ఎలా వున్నా కేంద్రంలో బీజేపీ అండదండలు అవసరమని ఆయన భావిస్తున్నారట. ఎందుకంటే 2004, 2009లో వరుస గా ఓడిపోయిన అనుభవం ఆయనకుంది. ఏ కారణం చేతనైనా అలాంటిస్థితి వస్తే టీడీపీని కాపాడుకోవడానికే గాక పదవుల నీడ కాపాడుకోవడానికి కూడా పొత్తు వుండాలని ఆలోచిస్తున్నారట. టీడీపీలో ఒక పెద్ద భాగం బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలలో దళితులలో నష్టం జరుగుతుందని సీట్లు తగ్గి పార్టీ నేతలు దూరమవు తారని హెచ్చరించినా సరే, ఆ సంగతి నాకు వదిలేయ మని ఆ దిశలోనే అడుగులు వేయడానికి అదే కారణ మంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేగువేరాను పక్క నపెట్టి వినాయక్‌ సావర్కార్‌ను సనాతన ధర్మాన్ని నెత్తికె త్తుకున్నాక సంఘ పరివార్‌ బీజేపీలో సహజమిత్రుడుగా స్థానం కాపాడుకోవాలనుకుంటున్నారు.రాష్ట్రం వరకూ టీడీపీతో వెళ్లడం అనివార్యమని నిర్ణయానికొచ్చారు, బీజేపీ నాయక త్రయం మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డా లకు ఈ జంటకవులు చక్కగా అక్కరకు వచ్చారు. ఫిబ్ర వరి 7న అమిత్‌ షాతో అర్ధరాత్రి తొలిభేటీ జరిపిన చంద్రబాబు ఈ నెలరోజులు ఆపార్టీ తన సంగతి అధికా రికంగా ప్రకటించకపోయినా మళ్లీ మార్చి 7 అర్థరాత్రి వరకూ సహనంతో వేచివున్నారు. ఈ లోపల జనసేన, టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రకటించి, ప్రత్యేక హోదా, కేంద్రం నిధుల విడుదల వంటి అంశాలే ప్రస్తావించ కుండా,సభలూ సందడులు సాగిస్తూ వచ్చారు.ఎట్టకేలకు అమిత్‌షా, నడ్డాలతో ఇప్పుడు చర్చల ప్రక్రియలో ప్రవే శించారు. దక్షిణాదిన బీజేపీకి తొలిసారి కాలూనడానికి చోటిచ్చిన చంద్రబాబు ఈ ఎన్నికల సమయంలో మరోసారి దాని వ్యూహాలకు ఊతంగా నిలబడుతు న్నారు. ఈ క్రమంలో ముందుగా సమాధి అవబోతున్నది ప్రత్యేక హోదా, దాంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు. తర్వాత సవాలు లౌకిక తత్వానికి.బీజేపీని పిలిచి నెత్తిన పెట్టుకోవడమంటే ఏపీలో మత తత్వ రాజకీయాలకు పిలిచి పీట వేయడమే. గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువగా ఒక్క శాతం కూడా ఓట్లు రాని బీజేపీని, మోడీని మోసేందుకు టీడీపీ, జనసేన సిద్ధమైపో యాయి. ఇక వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోక పోయినా మొదటి నుంచి దాన్ని మోస్తూనే వుంది. ఈ అయిదేండ్ల పాలనలోనూ ఒక్క సారి కూడా బీజేపీని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈ విధంగా పాలక ప్రతిపక్ష పార్టీలూ పోటీపడి మోడీని మోయడం ఒక్క ఏపీలోనే చూస్తాం. అధికార ప్రయోజనాలు,కార్పొరేట్‌ బంధాలు తప్ప ఇందుకు మరో కారణం కనిపించదు. ఈ మత రాజకీయాలకు తోడు పవన్‌ కళ్యాణ్‌కూ కాపు పెద్దలకూ మధ్య నడిచిన రాజ కీయ రభసలు మరోసారి కులం కుంపటిని రాజేసే అవ కాశముంది. వైసీపీ, టీడీపీ కూడా అనేక రూపాలలో కులసమీకరణలను పెంచుతున్నాయి. కేవలం ఎన్నికల అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రశాంతతను భగం చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం.
వామపక్షాల పంథా, ఇతర పార్టీలు
దీనికి తోడు అవకాశవాదం తో టికెట్‌ కోసం చూసి రాకపోతే అవతలి పార్టీలోకి దూకడం, అప్పటిదాకా తిట్టిపోసిన వారినే అక్కున చేర్చుకోవడం విచ్చల విడిగా సాగుతున్నది. ఈ సమ యంలోనే ముఖ్యమంత్రి అమరా వతి పూర్తికి హామీ ఇచ్చే బదులు విశాఖ రాజధాని పేరిట మళ్లీ మూడు రాజధానుల వివాదాన్ని పైకి లేపడం ప్రాంతీయపరమైన రాజకీయాలను పురికొల్పే ప్రయ త్నమే. జగన్‌ సర్కారు తప్పులు, ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటం సరైందే అయినా ఆ పేరుతో బీజేపీ జట్టుకట్టడం ఏ విధం గానూ సరైంది కాదని ఆలోచనా పరులు అర్థం చేసుకోవలసి వుంటుంది. కాని టీడీపీ, వైసీపీ అనుకూల మీడియా కథనాలలో తమ తగాదాలు తప్ప బీజేపీ మతతత్వం, సమాఖ్యతత్వం వంటి అంశాల ఊసే చూడం.
ఈ సమయంలో వామపక్షాలు రాష్ట్ర ప్రయోజ నాలు, దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం గట్టి గా నిలబడి కలిసివచ్చేవారిని సమీకరించడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం. సీపీఐ(ఎం), సీపీఐలతో పాటు కాంగ్రెస్‌, ఆప్‌, జైభారత్‌, ప్రత్యేకహోదా పరిరక్షణ సమితి వంటివి ఈ కార్యక్రమాలలో కలసి వచ్చాయి. ఆ విధంగా ఒక సమాంతర ప్రజాస్వామిక స్వరం వినిపించే అవకాశం కాపాడబడింది. వైఎస్‌ షర్మిల వచ్చాక ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులతో సహా పర్య టనకు రావడం, తిరుపతి ,అనంతపురం వంటి చోట్ల సభలు జరపడం కొంత కదలికకు దోహదపడింది. కాంగ్రెస్‌ విధానం ఇంకా సమగ్రంగా తెలియవలసి వుంటుంది.
రేవంత్‌ వ్యాఖ్యల దుమారం
తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా త్వరలోనే ఏపీలో పర్యటించి ప్రచారం చేస్తా రని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన ఈ మధ్యనే ఆకాంక్షిం చారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గి పోయిం దని ఆయన ఆవేదన వెలి బుచ్చుతూ చంద్రబాబును వది లేసి వెంకయ్యనాయుడు పేరును ప్రస్తావించడం ఆసక్తి కలిగిం చింది. ఇప్పుడు స్వయంగా ఆయనే ఏపీకి పర్యటనకు రానుం డడంతో ఏం చెబుతారు చూడ వలసి వుంటుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాటలు దుమారం రేపాయి. మోడీని బడాభారు (పెద్దన్న) అంటూ అభివర్ణించిన రేవంత్‌ కేసీఆర్‌ హయాంలో కేంద్రంతో సంబంధాలు దెబ్బ తింటే తాను దారిలో పెడుతున్నా నన్న సంకేతం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాలు వుండాల నడం బాగానే వున్నా అందుకు ప్రధాన ఆటంకం కేంద్రం ఏకపక్ష పోకడలేనన్న ప్రాథమిక వాస్తవం విస్మరించారు.గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి కావడా నికి మోడీ సహకారం కావాలని అభ్యర్థించారు. ఎన్ని కలకు నెలరోజుల ముందు జరుగుతున్న సభలో మోడీని ఇలా అభ్యర్థించడమంటే రాబోయేది ఆయన ప్రభుత్వ మేనని సంకేతాలిచ్చినట్టయిందని మీడియాలో వ్యాఖ్యా నాలు వచ్చాయి. గుజరాత్‌లా అభివృద్ధి అని ఆ రాష్ట్రాన్ని నమూనాగా చూపడం కూడా దేశంలో వున్న విమర్శల నేపథ్యంలో చెల్లుబాటయ్యేదికాదు. అంతేగాక ఇన్ని ప్రశం సల తర్వాత కూడా మోడీ తన పర్యటనలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను తీవ్రంగా విమర్శించి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌కు తాజా ఏటీఎం అన్నారు. విమర్శలు వచ్చాక రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తాను సమాఖ్యస్పూర్త్తితో ప్రధానిని గౌరవించినట్టు రేవంత్‌ సమర్థించుకున్నారు. గుజరాత్‌కు ఇచ్చినట్టే తమకూ ఇవ్వాలని తమ ఉద్దేశమని కొత్త అర్థం చెప్పారు. ఎవరో పక్కదోవ పట్టించడం వల్లనే మోడీ ఏటీఎం అన్నారని సర్దుబాటు చేశారు. నిజంగా మోడీని పక్కదోవ పట్టించే దెవరు? ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి చేయడం, అవినీతి పేరుతో ఈడి, సిబిఐని పురికొల్పడం మోడీ సర్కారుకు రివాజుగా మారిందిన తెలిసీ ముఖ్యమంత్రి ఇలా వెనకేసుకురావడం ఆశ్యర్యం కలిగించింది. కాంగ్రెస్‌ పెద్దలలోనూ తన మాటలపై అసంతృప్తి వ్యక్తం కాగా బీజేపీకి అనుకూలమైన కొన్ని మీడియాల్లో మద్దతు లభించింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ ఈ ప్రభుత్వం నాలుగు నెలల్లో కూలి పోతుందని బెదిరించడం ఆయన కోపానికి కారణ మైంది. వీటన్నిటికి సమాధానంగా రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి స్వంత జిల్లా పాలమూరు సభలో ఉగ్ర రూపం దాల్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే మెడపై కాలుపెట్టి తొక్కుతానని, పేగులు మెడలో వేసుకుంటాననీ, తమ వాళ్లు మానవబాంబులవుతారనీ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజకీయ సవరణ కోసం ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమైనాయి.
టీ బీజేపీ ఎత్తుగడలు
మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో ఒక షిండే వున్నాడనీ ఎప్పుడైనా ఆ ప్రభుత్వం కూలి పోతుందని అంటూనే వున్నారు.మోడీపై రేవంత్‌ మెతకవైఖరి దాని ఫలితమేనని ఆరోపించారు.తమాషా ఏమంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కూడా షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుందని చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీతో కలవడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేసిందని కథలు నడుస్తూనే వున్నాయి. ఈ మధ్యలోనే బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కేసీఆర్‌ను కలిసి పొత్తు ప్రయత్నాలు ప్రారంభించారు. మాయవతి ఆశీస్సులతోనే ఇది జరిగిందని సమాచారం, మత తత్వంపై పోరాటం కోసం కాంగ్రెస్‌ను ఎదిరిస్తామని వారు చెప్పడం ఈ పొత్తు ఉద్దేశాలపై ప్రశ్నలు రేపింది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య సమదూరం అనడం బీజేపీపై పోరాటం పదును తగ్గించేందుకే దారితీస్తుందన్న అభి ప్రాయాలు బలంగా వున్నాయి. బీఆర్‌ఎస్‌ పేరుతో హడావుడి చేసిన కేసీఆర్‌ ఆ ప్రయత్నాలు దాదాపు విరమించుకున్న దశలో తెలంగాణలో ఈ ప్రయత్నం ఎటువైప నేది ప్రశ్న. బీజేపీ అభ్యర్థులను ప్రకటించి తామే గెలుస్తామని ప్రకటిస్తుంటే కాంగ్రెస్‌కూడా నాలుగు పేర్లు విడుదల చేసింది. సీపీఐ, కాంగ్రెస్‌తో సీట్ల కోసం మాట్లాడుతుంటే సీపీఐ(ఎం) కూడా ఒక చోట పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో భిన్న శిబిరాలుగా పార్టీలు ఎన్నిక లకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ మాత్రం దేశ మంతటిలాగే ఇక్కడా తన ఏకపక్ష వ్యూహాలతో చాపకింద నీరులా రాజకీయం నడుపుతుందనేది గమనించాల్సిన వాస్తవం.
తెలకపల్లి రవి

Spread the love