జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్తత..

నవతెలంగాణ – జగిత్యాల: కోరుట్ల లో 50 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో మహిళల గుడిసె పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో మహిళలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున 24 మంది సీపీఎం నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నాయకులను విడిచిపెట్టాలని ఆర్డిఓ కార్యాలయంకు ర్యాలీగా వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంగెం రోడ్డులోని ప్రభుత్వ భూమిలో పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. అయితే ఆ స్థలాన్ని తమకే కేటాయించాలని మహిళలు ఆందోళన చెందుతున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో 46 రోజులుగా గుడిసెలు వేసుకుని మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఉదయం పోలీసుల సహకారంతో రెవెన్యూ సిబ్బంది సీపీఎం జెండాను, గుడిసెలను జేసీబీతో తొలగించారు. గుడిసెల తొలగింపునకు నిరసనగా మహిళలు సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆర్డీఓ కార్యాలయానికి పెద్దఎత్తున వెళ్తున్న మహిళలు, సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణలో పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు మహిళలు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న మహిళలను పోలీసులు చదరగొట్టే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు మహిళలను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Spread the love