పిల్లలకు పరీక్షలు అంటే ముందు తల్లి దండ్రులకే కంగారు, ఆందోళన. వారికి తినడానికి ఏం పెట్టాలి అని. ఈ రోజుల్లో పిజి చదువుతున్న పిల్లలకు కూడా తల్లులే అన్నం తినిపిస్తున్నారు. అది పిల్లలు ఎదుటి వారి మీద ఆధారపడేలా చేస్తుంది. వారికి ఇష్టమైన రీతిలో ప్రశాంతంగా చేసి పెట్టండి. పిల్లల ఆహారం విషయంలో ఓపిక, అవగాహన లేకపోతే, బలానికి, బరువుకి, తెలివికి అంటూ టానిక్కులతో పిల్లల పొట్ట నింపాల్సి వస్తుంది. అందుకే అంటాను – సమీకృత ఆహారమే బిడ్డకు సర్వోన్నత ఔషధం. అలాంటి ఆహారం తినే బిడ్డకు డాక్టర్ల అవసరం కూడా పెద్దగా రాదు. బాగా చదవగలరు.
విజయాల సాధనలో, విద్యార్థులు తినే పోషకాహారం పనితీరు, శక్తి స్థాయిలు నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆహారంలో సమతుల్యత అవలంబించడం ద్వారా, శరీరానికి మెదడుకు అవసరమైన పోషకాలను అందించవచ్చు.
విజయం కోసం బాగా తినడం
అల్పాహారంగా పాలు, పండ్లు; భోజనం తాజా కూరగాయలతో వండిన కూరలతో కలిపి అన్నం లేదా రోటీలు పెట్టండి. ప్రతిరోజూ సమతుల్య భోజనం పిల్లలకి అవసరమైన విటమిన్, ప్రోటీన్ కేలరీలు అందేలా చూస్తుంది.
కారు సమర్థవంతంగా నడపడానికి నాణ్యమైన ఇంధనం అవసరం అయినట్లే, మన శరీరాలు మనస్సులు ఉత్తమంగా పనిచేయడానికి సరైన పోషణ అవసరం.
మెదడు-ఆహారం కనెక్షన్
జ్ఞాపకశక్తిని పెంచడానికి పోషకాలు అవసరం. మెదడు పనితీరులో కొన్ని ముఖ్యమైన పోషకాలు పనిచేస్తాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: సాల్మన్, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చేపలలో లభించే ఒమేగా-3లు కాగ్నిటివ్ స్కిల్స్‌ని, మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు: రంగురంగుల పండ్లు కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు: బ్రౌన్ రైస్, ఓట్స్ క్వినోవా వంటి తృణధాన్యాలు మీ మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి.
ప్రోటీన్: చికెన్, బీన్స్, టోఫు వంటి ప్రోటీన్‌లోని లీన్ మూలాలు న్యూరోట్రాన్స్‌మీటర్ ఉత్పత్తిలో సహాయ పడతాయి. ఇది జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనం, ఏకాగ్రతకు కీలకం.
విటమిన్లు, ఖనిజాలు: విటమిన్ బి, డి, ఇనుము వంటి పోషకాలు అభిజ్ఞా (కాగ్నిటివ్ స్కిల్స్) అభివృద్ధి, ఏకాగ్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్లాన్ చేయండి
సిద్ధం చేయండి: భోజనం, స్నాక్స్‌లను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.
మైండ్‌ఫుల్ తినడం: నెమ్మదిగా తింటూ ఆహారాన్ని ఆస్వాదించాలి. టీవీ, ఫోన్ చూస్తూ తినడం మానండి. మైండ్‌ఫుల్‌గా తింటే అతిగా తినడాన్ని నిరోధించవచ్చు.
అల్పాహారం ముఖ్యం : అల్పాహారం జీవక్రియను కిక్‌స్టార్ట్ చేస్తుంది. రోజును ప్రారంభించడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఉదయపు భోజనంలో పండ్లు, తృణధాన్యాలు, పెరుగు, గుడ్లు తీసుకోవడం వల్ల రోజంతా హుషారుగా వుంటారు.
హైడ్రేషన్: డీహైడ్రేషన్ అలసటకు దారితీస్తుంది. నీరు ఎక్కువగా తాగాలి.
స్నాక్ స్మార్ట్: క్లాసుల మధ్యలో శక్తి కోసం పెరుగు, పండ్ల వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. చక్కెర, అధిక కెఫిన్‌లకు దూరంగా వుండాలి.
నిద్ర, పోషకాహారం: తగినంత నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి కీలకం. సరైన పోషకాహారం మెరుగైన నిద్ర నాణ్యతకు తోడ్పడుతుంది.
పోషకాహారం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక శ్రేయస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. మునగాకు పొడి హిమోగ్లోబిన్ అందించడంతో పాటు హార్మోన్లను బాలెన్స్ చేస్తుంది. ఎండిన అత్తి పండ్లలో (అంజీర్) యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
కాల్షియం రిచ్ ఫుడ్స్: పెరుగుతున్న విద్యార్థులు ఎముకల పెరుగుదలకు కాల్షియం అవసరం. పాలు, పెరుగు, జున్ను వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. ఆకుపచ్చ కూరల్లో కాల్షియం అధికంగా వుంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకలీతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను తింటే శరీరానికి ఐరన్ ఎక్కువగా అందుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్