కాంగ్రెస్‌ పార్టీకి ధన్యవాదాలు

–  ముదిరాజ్‌ చైతన్య వేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పటాన్‌చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించినందుకు కాంగ్రెస్‌ పార్టీకి ముదిరాజ్‌ చైతన్య వేదిక ధన్యవాదాలు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు శివ ముదిరాజ్‌ మాట్లాడుతూ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్‌ల మద్ధతు కాంగ్రెస్‌ పార్టీకుంటుందని స్పష్టం చేశారు. నీలం మధుపై రాజకీయంగా ఎదుర్కోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ చైతన్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నర్సింహా ముదిరాజ్‌, పుట్టి భాస్కర్‌ ముదిరాజ్‌, సురేష్‌, నవీన్‌, వెంకటేష్‌, స్వామి ముదిరాజ్‌ తదితర రాష్ట్ర , జిల్లా, నియోజక వర్గాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love