కబ్జా నుండి బూరుగుకుంట చేరువును కాపాడాలి

– మెదక్ ఎంపీకి బల్వంతాపూర్ గ్రామస్తులు వినతి
– సమస్య పై తహశీల్దార్ తో ఫోన్లో ఎంపీ సంభాషణ
– సమస్య పరిష్కరించి, చెరువులు కాపాడాలని అధికారులకు ఎంపీ ఆదేశం
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
కబ్జాకు గురవుతున్న బూరుగుకుంట చెరువును కాపాడాలని బల్వంతాపూర్ గ్రామస్తులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి బుధవారం విన్నవించారు. ఈ మేరకు దుబ్బాక మండల కేంద్రంలో ఎంపీని బల్వంతాపూర్ గ్రామస్తులు  కలిసి వినతపత్రం అందజేశారు. గ్రామంలోని “బూరుగుకుంట చెరువును” అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేసి, రాత్రింబవళ్ళు టిప్పర్ల ద్వారా మట్టి కొడుతూ అక్కడున్న చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తాము అడ్డుకున్నా కూడా పనులు జరుగుతున్నాయని ఆ చెరువులోనే బతుకమ్మ వేసి పండగలు జరుపుకుంటామని నేడు ఆ చెరువు పూర్తిగా అన్యాక్రాంతం ఐతే ఇక బతుకమ్మ ను ఏ చెరువులో వేయాలని ఎంపీకి వారి ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వెంటనే గ్రామస్తులు , రైతుల ద్వారా ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుబ్బాక తహశీల్దార్ సలీమ్ మియా తో పాటు పలు శాఖల అధికారులను ఎంపీ ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించి, సమస్యలకు అక్కడున్న రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. చెరువును కాపాడాలని తాసిల్దార్ కార్యాలయంలో వినతి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో బూరుగుకుంట చెరువు కబ్జా గురయ్యింది. దీంతో ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ…. బల్వంతపూర్ గ్రామస్తులు, రైతులుబుధవారం దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్అసిస్టెంట్ ప్రవీణ్ కి బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువును కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బల్వంతపూర్ గ్రామస్తులు రైతులు ఉన్నారు.

Spread the love