ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్‌

నవతెలంగాణ-మియాపూర్‌
హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న నిందితులను ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేసి, రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కత, ముంబయి నుంచి కొరియర్‌ ద్వారా ఈ-సిగరెట్లు తెప్పిస్తున్న మాధవ్‌, 63 మంది కళాశాల విద్యార్థులకు విక్రయించారు. పంజాగుట్టలోని అమిటీ కళాశాల, శంకర్‌పల్లిలోని ఇక్ఫారు, ఐబీఎస్‌ బాచుపల్లిలోని మహీంద్ర విశ్వవిద్యాలయం, కొండాపూర్‌లోని సంక్రీత్‌ కళాశాల, షేక్‌పేట్‌లోని ఆకర్ష్‌ ఇన్‌స్టిట్యూట్‌, పటాన్‌చెరులోని గీతం కళాశాలలో కొంత మంది విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అమిటీ కళాశాలకు చెందిన అచ్యుత గౌతమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో 71 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు విక్రయించినట్టు గుర్తించారు. ఈ కేసును రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేశారు.

Spread the love