పచ్చదనం పెంచే అతి పెద్ద ప్రయత్నం ‘తెలంగాణకు హరితహారం

– మొక్క నాటి నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే
నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో శనివారం నాడు  జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భూ భాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గు మొఖం పడుతుందని  వాతవారణ సమతుల్యం మానవ జీవితమే అల్లకల్లోలం అవుతుందని ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు  కోటి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరగిందని . భూభాగంలో 33శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రతీ గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పని సరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందని. కొత్తగా రూపొందించిన పంచాయతీ రాజ్ చట్టంలో ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించారు. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని, గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని, ఇది గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత అని చట్టంలో పేర్కొన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సూర్యకాంత్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి అటవీ శాఖ అధికారి సంజయ్ గౌడ్, సంతోష, జడ్పీ సీఈవో సాయా గౌడ్, కో ఆప్షన్ నెంబర్ జాఫర్,ఉప సర్పంచ్ విట్టల్,  పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు చిప్ప రమేష్, హనుమంత రెడ్డి, ప్రేమ్ సింగ్, మమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్, గ్రామపంచాయతీ సిబ్బంది తానాజీ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love