
నవతెలంగాణ – వేములవాడ
దేశ సంపాదనను బీజేపీ ప్రభుత్వం కొంతమందికే పంచి పెడుతుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తాంఅని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ అన్నారు.. ఆదివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ మేరు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు. గత ప్రభుత్వం వారు తమను ఏ మాత్రం పటించు కొలేదని, అసలు మా కులం ఒకటి ఉందనీ కూడా వారు గుర్తించాలేదన్నారు.మేరు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, అందుకు సహకరించిన ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట స్థాయి మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బిఆర్ఎస్ పార్టీని ఎలాగైతే పక్కన పెట్టారో దేశంలో కూడా బీజేపీని పక్కన పెట్టాలని అందులో మీ భాగస్వామ్యం కావాలన్నారు.రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు పోతున్నామని అందులో భాగంగా రాష్ట్రంలోని 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. దేశంలో ప్రజల స్థితిగతులను వారి జీవన విధానాలను పరిశీలించడానికి భారత్ జోడో యాత్రా చేశారు అని తెలియజేశారు.దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతూ ఎవరెంత వారికి అంత అనే నినాదంతో ముందుకు పోతూన్నాం.దేశ సంపాదనను బిజెపి ప్రభుత్వం కొంతమందికే పంచి పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తాం అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు అందించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలిఅని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్,రాష్ట్ర మేరు జేఏసీ చైర్మన్ మునిగల రాము, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఓదెల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మంతెన దుర్గేశ్, మోతే అనిల్, శంకర్ ,సాయి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.