
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంగం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మాత్యులు బ్రాహ్మణ ముద్దు బిడ్డ దుద్ధిల్ల శ్రీధర్ బాబు ని కలిసి బుధవారం ఘనంగా సన్మానించారు. నిజామాబాదు బ్రాహ్మణ సంగం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మంత్రి కి విజ్ఞప్తి చేస్తూ నిజామాబాదు నగరం లో బ్రాహ్మణులకు స్థలం ఇప్పించి బ్రాహ్మణ భవనం, వేద పాఠశాల ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి బ్రాహ్మణ భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని వివేకానంద ఓవర్ సీస్ క్రింద సంక్షన్ అయిన స్కాలర్షిప్ లను కూడా వెంటనే విడుదల చేయింంచే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సంగం ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ, కోశాధి కారి పుల్కల్ రమేష్, సభ్యులు జయంత్ రావు, కోస్లి చంద్రశేఖర్, లక్ష్మి నారాయణ భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.