హామీలను మరచిన బీఆర్ఎస్ ప్రభుత్వం..

నవతెలంగాణ- నసురుల్లాబాద్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని, బీఆర్ఎస్ పార్టీపై విరక్తి చెంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాసుల బాలరాజ్ తెలిపారు. శుక్రవారం బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తుందన్నారు.  అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం అయిన తొలి సంతకం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ తో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు రైతులకు ఇబ్బందిగా తయారైన ధరణి వ్యవస్థను రద్దు చేయడం జరుగుతుందన్నారు. 4000 రూపాయల పెన్షన్, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,  గ్యాస్ ధరను 500 రూపాయలకే సిలిండర్ అందజేయడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ బాన్సువాడ  నియోజకవర్గం పై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. ఈ  కార్యక్రమంలో  మండల అధ్యక్షులు బోయిని  శంకర్, మాజీ సర్పంచ్ సానెపు గంగారాం, దేశాయి , మండల  కిసాన్  కాంగ్రెస్  అధ్యక్షులు  పీరయ్య, యమా రాములు, రఫీ, సొసైటీ ఉపాధ్యక్షులు దొంతురం గంగారాం, సాయిలు, తోట మాణిక్యం, ఐనాల సాయిలు, బోయిని గంగాధర్ హుసేన్, బాశెట్టి, నీరడి సాయిలు  తదితరులు  పాల్గొన్నారు.
Spread the love