కేటీఆర్ పై కేసు ?


నవతెలంగాణ కంటేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ 1 టౌన్ లో టీపీసీసి ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. నిన్న బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సికింద్రబాద్ లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..’ మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సి.ఎం.రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసులు చేసిన రూ.2,500 కోట్లను డిల్లీకి పంపించారు. ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను మరోవైపు బిల్డర్లు రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కత్తెర పెట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారు` అంటూ ఆరోపించరని, అభూతకల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగముగా ఆరోపించడము, రైస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహాజనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరం అని, కాబట్టి కె.టి.రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్టు చేసి పై విషయాలను రుజువుపరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతని పై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకొనగలరని తహెర్ బిన్ హందన్ డిమాండ్ చేశారు.

Spread the love