ముఖ్యమంత్రి కృతజ్ఞతా సభను జయప్రదం చేయాలి

– మేడుదుల వెంకన్న ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు

నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ముఖ్యమంత్రి కృతజ్ఞతా సభను ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు విడుదల వెంకన్న పిలుపునిచ్చారు . గురువారం మండల కేంద్రంలో మండల ఉద్యమకారుల సంఘం సమావేశం సీనియర్ ఉద్యమకారుదు డాక్టర్ హేమాద్రి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకన్న హాజరై మాట్లాడారు. ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించడం అందరం హర్షించదగ్గ విషయమని అన్నారు. అట్టి ప్రకటనను నిజం చేస్తూ వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలంతో పాటు గుర్తింపు కార్డు పెన్షన్స్ సౌకర్యం ప్రజా పాలన 6 గ్యారంటీలను అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈనెల 12న హైదరాబాద్ సుందరయ్య భవన్లో జరిగే ముఖ్యమంత్రి కృతజ్ఞత సభను ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సూర్నేని శ్రీనివాసరావు మండల ప్రధాన కార్యదర్శి కడారి తిరుపతి మహిళా జిల్లా అధ్యక్షురాలు భక్తుల రాణి కొన్ని రమేష్ ఆకిన పెళ్లి రమేష్ దర్శనాల సంజీవ తదితరులు పాల్గొన్నారు.
Spread the love