నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
తండాకు రోడ్డు వేయాలని గి రిజనులు ఆందోళన చేపట్టారు. తండా నుంచి తొర్రూరుకు వెళ్లేం దు కు రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మం డలంలోని పత్తేపురం గ్రామ శివారు ధర్మ తండాలో గిరిజనులు ఆందోళన చేపట్టా రు. వర్షాలతో చిత్తడిగా మారిన మట్టి దారిని చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం ఏర్పడిన ధర్మా తండాలో ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని, మట్టి దారి బురద, గుంతల మయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తరచూ కిందపడి ప్రమాదా ల బారిన పడుతున్నారని, నడిచేందుకు సైతం వీలు లేకుండా మట్టి దారి తయారైం దని తెలిపారు. అనారోగ్యం పాలైన వారిని ఎత్తుకొని ప్రధానరోడ్డు వరకు వెళ్లాల్సి వ స్తుందని తెలిపారు. గుంతలు, బురద మయంగా దారి ఉండటంతో 108 అంబులె న్స్ తండాకు రావడం లేదని తెలిపారు. ఎన్ని మార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల కు విన్నవించిన ఫలితం లేదన్నారు. మంత్రి దయాకర్ రావు స్పందించి రోడ్డు ఏర్పా టు చేసి సమస్య తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బానోతు రమేష్, బానోతు కాంతమ్మ, మూడ్ లింగయ్య తారమ్మ, రవీందర్, తార్యా, మంజుల పాల్గొన్నారు.