పంచాయతీ కార్యదర్శి మృతి చెందడం బాధాకరం

– పాడెపట్టిన మండల తహసీల్దార్ రాజు
– పాడే పట్టిన ఎంపీ ఓ బండారు పార్థసారథి
నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి బూరుగడ్డ రాకేష్ మృతి చెందడం ఎంతో బాధకరమని తహసీల్దార్ కోడి చింతల రాజు ఎంపీడీవో బాలరాజు ఎం పి ఓ బండారు పార్థసారథి అన్నారు. శనివారం మృతి చెందిన రాకేష్ స్వ గ్రామం గార్ల గ్రామంలో ఆయన భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆయన పాడే పట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి వ్యక్తి గ్రామాన్ని రంగాలు అభివృద్ధి పరచడంలో ఎంతో సహకరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఆయన మృతి చెందడం ఎంతో బాధకరమని తెలిపారు. అలాంటి మంచి వ్యక్తి దొరకడం కష్టమని కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో విషాదాచార్యులు చోటుచేసుకున్నాయి. ఆ గ్రామం నుంచి అనేకమంది బయల్దేరి ఆయన సొంత గృహం గార్లకు పంచాయతీ కార్యదర్శులు కారోబార్లు రెవిన్యూ సిబ్బంది వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు వెళ్లారని తెలిపారు.
Spread the love